ముఖ్యమంత్రి రోశయ్య

నేటి రాజకీయాలు .... మన నాయకులు....

Saturday, July 3, 2010

ముఖ్యమంత్రి రోశయ్య ‘మనశ్మాంతి’ యాత్ర..

వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర ప్రారంభమైన నాటి నుంచి సంభవిస్తున్న పరిణామాలతో కలత చెంది, అత్యంత సన్నిహితులతో మాత్రమే ఆవేదన వెళ్ళబోసుకుంటున్న ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య బు ధవారం ఢిల్లీలో సాధ్యమైనంత ఎక్కువ మంది పార్టీ పెద్దలను కలసి పరిష్కారం సంపాదించి మనశ్శాంతి పొం దేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. పేరుకు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం దేశంలో శాంతి భద్రతల పరి రక్షణ, మావోయిస్టుల తాకిడిని తట్టుకునే వ్యూహానికి రూ పకల్పన చేయటమే ఎజెండాగా జరిపే అధికార పర్యటన అయినప్పటికీ, రోశయ్య మనసంతా రాష్ట్రంలో శరవేగంగా సంభవించిన రాజకీయ పరిణామాలపై అధిష్ఠానానికి పూస గుచ్చినట్టుగా వివరించి బరువు దింపుకోవటమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వ్యక్తిగత దాడిపై ఫిర్యాదు?
ఓదార్పు యాత్రలో భాగంగా రణస్థలంలో మాట్లాడుతూ జగన్‌ తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను రోశయ్య అధిష్ఠా నం పెద్దల వద్ద ప్రముఖంగా ప్రస్తావించనున్నట్టు సమాచా రం. యాత్ర ప్రారంభించిన తొలి ఒకటి, రెండు రోజులు సాదా సీదాగా మాట్లాడిన జగన్‌ మూడవ రోజుకు మాటల దూకుడు పెంచారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పాల్గొ నకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలను కట్టడి చేశారని, ఆంక్షలు విధించాల్సినంత పాపం తాను ఏమి చేశానని ఆవేదనతో చెప్పుకున్నారు. ఈ యాత్రపై రోశయ్య ఒకటి, రెండు చాన ళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చిన మరుసటి రోజున జగన్‌ వ్యా ఖ్యల తీవ్రత చాలా పెరిగిపోయింది. రణస్థలంలో జరిగిన సభలో మాట్లాడుతూ తాను యాత్ర చేస్తే తన ముఖ్యమం త్రి పీఠం కదలిపోతుందని రోశయ్య భయపడుతున్నట్టు న్నదని నేరుగా ఆయననే లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు.
Rosaiah
ఇవి సహజంగానే రోశయ్యను కలచి వే శాయి. దాని ఫలితమే ఆయనను వెనకేసుకు వస్తూ మం త్రులు బొత్స సత్యనారాయణ, పీసీసీ అధికార ప్రతినిధి టి.తులసీరెడ్డి, మాజీ ఎంపీ పి.సుధాకరరెడ్డి లాంటి వారు ఎదురుదాడికి దిగటం. అంతకు ముందు ధర్మాన ప్రసాద రావు, గాదె వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు భట్టి విక్రమార్క లాంటి వారు జగన్‌ను విమర్శించకపోయినా రోశయ్యను సమర్థిస్తూ మాట్లాడటం లాంటి పరిణామాలు సంభవించాయి. తనను టార్గెట్‌గా చేసుకుని జగన్‌ మాట్లా డటాన్ని రోశయ్య సహించలేకపోతున్నారు. దీనిపై ఆయన ప్రత్యేకంగా ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.

మంత్రులతో మంతనాలు?
ఢిల్లీ యాత్రకు బయలుదేర బోయే ముందు రోశయ్య తనకు అత్యంత సన్నిహితులైన మంత్రులు కొందరితో సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు సమాచారం. ఢిల్లీలో ఎవరె వరిని కలవాలో, వారితో ఏమి చెప్పాలో పక్కాగా ఇక్కడే వ్యూహ రచన చేసుకుని ఆయన విమానం ఎక్కారంటున్నా రు. జగన్‌పై చర్య తీసుకోవాలన్న ఫిర్యాదు చేసే ఉద్దేశం లేకపోయినా, కనీసం కట్టడి చేసేందుకు అధిష్ఠానం ఏమి చర్యలు తీసుకోదలచిందో వాకబు చేయటం రోశయ్య పర్యటనలో ప్రధాన అంశంగా చెబుతున్నారు. జగన్‌పై అధిష్ఠానం వద్ద తీవ్ర స్థాయిలో మాట్లాడాలని కొందరు మంత్రులు చేసిన సూచనలపై స్పందిస్తూ ఆ అవసరం ఇంకా రాలేదని, అయినా జగన్‌ మళ్ళీ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదు కదా? ఆయనకేమైనా అధిష్ఠానం నుంచి సూచ నలు వచ్చాయేమో.. చూద్దాం.. అని జవాబిచ్చినట్టు తెలిసింది.

ఎవరెవరితో భేటీ?
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోనియా తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని రోశయ్య తప్పనిసరిగా కలుస్తున్నారు. ఈ భేటీలో ఓదార్పు యాత్ర మొదలైనప్పటినుంచే కాక అంతకు ముందు నుం చి కూడా జగన్‌ వర్గీయులు తనపై సాగిస్తున్న మాటల దం డయాత్రపై వివరాలు తెలియజేయనున్నట్టు సమాచారం. ఆ తర్వాత అహ్మద్‌ పటేల్‌, అవకాశం వస్తే వీరప్ప మొయి లీ లాంటి వారిని కలుస్తారు. ఉప ఎన్నికల్లో ప్రచారానికి మంత్రులకు బాధ్యతలు, సీనియర్లను ఇరకాటంలో పడవే స్తూ వీరప్ప మొయిలీ లేఖ రాసిన నేపథ్యంలో ఆయనతో సమావేశం కుదిరితే అది రాజకీయ ప్రాధాన్యం సంతరిం చుకోనున్నది. పనిలో పనిగా ఉప ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహం, ఇప్పటిదాకా ప్రచారం సాగుతున్న తీరు, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ సహా అభ్యర్థుల విజయావకాశాల వంటి వాటిపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇక అధికారికం..
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక చిదంబరం ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కానున్న రోశయ్య ప్రధాని మన్మోహ న్‌సింగ్‌ను కూడా కలుస్తారు. రాష్ట్రంలో మావోయిస్టుల ని రోధానికి కేంద్రం నుంచి రావలసిన రూ.1200 కోట్ల రూపాయలను విడుదల చేయాలని అభ్యర్థిస్తారు. అలాగే నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్ప న కోసం విడుదల కావలసిన నిధులను కోరటం, ద్రవ్య నియంత్రణ, బడ్జెట్‌ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) ద్వారా రావ లసిన రూ.1406 కోట్ల రూపాయల్లో 2008-09 సంవ త్సరానికి రాలసిన రూ.703 కోట్లు రాబట్టటం, సీఎస్‌టీ బకాయిలను కోరటం వంటివి ప్రధాన ఎజెండాగా రోశ య్య పర్యటన జరగనున్నది.

వీటి నివేదికలను ప్రధానికి సైతం సమర్పించనున్నారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరిం చటానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని, అందుకు తేదీని ఖరారు చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ను సైతం రోశయ్య కలవనున్నారు. ఆ తేదీ ఖరారైతే రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్తామని శాసనసభలో రోశయ్య ఇప్పటికే హామీ ఇచ్చి ఉన్నారు.