ముఖ్యమంత్రి రోశయ్య

నేటి రాజకీయాలు .... మన నాయకులు....

Monday, October 4, 2010

టీఆర్‌ఎస్‌ ‘ఆట’కు రోశయ్య చెక్‌ !

rosaiah-chek
టీఆర్‌ఎస్‌ ఆటకు ముఖ్యమంత్రి రోశయ్య చెక్‌ పెట్టారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న సాంస్కృతిక భావనను సొమ్ము చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్థి పొందాలన్న టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని రోశయ్య వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పండుగయిన బతుకమ్మ ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించా లన్న నిర్ణయంతో రాజకీయ లబ్ధి పొందాలన్న టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ దారుణంగా దెబ్బతిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కోటి బతుకమ్మల జాతర పేరిట కేసీఆర్‌ కూతురు, తెలంగాణ జాగృతి కన్వీనర్‌ కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి అనేది పేరుకు టీఆర్‌ఎస్‌కు సంబంధం లేకపోయినా, ఆమె కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే నిర్వహిస్తున్న విష యం బహిరంగమే. ఆమె కార్యక్రమాల వివరాలు కూడా టీఆర్‌ఎస్‌ కార్యాలయం నుంచే వెలువడుతున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యాన నిర్వహించే కోటి బతు కమ్మల జాతర ద్వారా తెలంగాణ ప్రజలకు సాంస్కృతికం గా దగ్గరయేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వమే బతుకమ్మ పండు గను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో టీఆర్‌ఎస్‌ ఇరకాటంలో పడినట్టయింది. దీనిద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వానికే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లపై చిత్తశుద్ధి ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.పండుగను సర్కారే స్వయంగా నిర్వహించడంతో పాటు.. జిల్లాకు లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. 7 నుంచి 15వ తేదీ వరకూ అన్ని జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించనుంది. హైదరాబాద్‌ పీపుల్స్‌ప్లాజాలో భాగ్య నగర్‌ బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఏడు రోజుల ఉత్సవాలను శిల్పారామంలో నిర్వహించనుంది.

ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగలో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎక్కువ సంఖ్యలో సమీ కరించనున్నారు. ప్రధానంగా.. మహిళా కార్యకర్తలను భారీగా సమీకరించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే ఉద్యమ సంస్థలనూ భాగస్వా ములను చేయనున్నారు. బతుకమ్మ పండుగను కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నిర్వహి స్తోందన్న సంకేతాలను విస్తృతంగా ప్రచారం చేయడమే రోశయ్య లక్ష్యంగా కనిపిస్తోంది.

తెలంగాణపై కాంగ్రెస్‌ మాట్లాడటం లేదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి రోశయ్య, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు వ్యవహరిస్తుందన్న సంకేతాలిచ్చేందు కే హటాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ను మానసికంగా దగ్గరచేసే ఈ సాంస్కృతిక ఎత్తుగడను తిప్పికొట్టినట్టయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి, రోశయ్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. చివరకు కాంగ్రెస్‌ నేతలు కూడా బతుకమ్మ పండుగ విషయంలో సీఎం ఇంత త్వరగా స్పందిస్తారని అంచనా వేయలేదు. ముఖ్యమంత్రి తాజా నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు మనో స్థైర్యం ఇచ్చినట్టయింది. ఇప్పటివరకూ తెలంగా ణ అంశంపై ఒక్క టీఆర్‌ఎస్‌ గళమే వినిపిస్తున్నం దున.. డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల్లో కాంగ్రెస్‌దే పైచేయి ఉండాలన్న లక్ష్యంతో పాటు, టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకు రోశయ్య ఇప్పటినుంచే వ్యూహరచన ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణపై సర్వ హక్కులూ తమదేనని భావిస్తూ, ఆ మేరకు తెలంగాణపై పట్టుకోసం కృషి చేస్తున్న కేసీఆర్‌, భవిష్యత్తులో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచడం ఖాయమని గ్రహిం చిన రోశయ్య.. ఇప్పటినుంచే తెలంగాణలో పార్టీని పటిష్టం చేసే వ్యూహంతోనే బతుకమ్మ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వ హించేలా ఉత్తర్వులిచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత తెలంగాణ సహా సీమాంధ్రకు చెందిన సీఎంలుగా ఎంతోమంది వచ్చినప్పటికీ, రోశయ్య ఒక్కరే తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రభుత్వ పరంగా నిర్వహించారన్న కీర్తి సంపాదించారు. తనకు ఏ ప్రాంతం పట్ల ద్వేషం గానీ, ప్రేమ గానీ లేదని, రాష్ట్రం విడిపోయినా తాను హైదరాబాద్‌ లోనే ఉంటానని రోశయ్య అనేకసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

నిజానికి, బతుకమ్మ పండుగను ప్రభుత్వమే నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ గానీ, ఆ పండుగ పేరుతో హడావిడి చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ గానీ ఇప్పటిదాకా డిమాండ్‌ చేయకపోవడం గమనార్హం.బతుకమ్మపై రోశయ్య సర్కారుకు అంత ఆసక్తి, శ్రద్ధ ఉండదన్న అంచనాతోనే టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆ డిమాండ్‌ జోలికి వెళ్లనట్లు కనిపిస్తోంది. ఙ‚తీరా రోశయ్య నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఆత్మరక్షణలో పడిన టీఆర్‌ఎస్‌ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని, ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల బడ్జెట్‌ ఏమాత్రం సరిపోదని కొత్త రాగం అందుకుంది. వీరి తీరు పరిశీలిస్తే.. బతుకమ్మ ఘనత కాంగ్రెస్‌ ఖాతాలో కలిసిపోతుందన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.రోశయ్య తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ఉద్యమ సంఘాలు, ప్రధానంగా మహిళా సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గుర్తించిన తొలి సీఎం రోశయ్యే
Katragadda-Prasanna‘రోశయ్య తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క బతుకమ్మ పండుగనే కాదు. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయా లను గౌరవించినట్టయింది. తెలంగాణేతరుడయినా బతు కమ్మ ప్రాధాన్యాన్ని గుర్తిం చిన తొలి ముఖ్యమంత్రిగా రోశయ్య చిరస్థాయిగా నిలిచిపోతారు. దీన్ని తెలం గాణకు చెందిన ప్రతి ఒక్క సెటిలరూ స్వాగతిస్తార’ని తెలంగాణ సెటిలర్ల ఫోరం కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగలో సెటిలర్లంతా పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో తామూ భాగస్వాములమని చాటి చెబుతామని చెప్పారు. తెలంగాణ గురించి ఉత్తి మాటలు చెప్పే కేసీఆర్‌ లాంటి నాయకులకంటే రోశయ్య ఇచ్చిన ఉత్తర్వు ఒక్కటే ఆయన చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. బతుకమ్మ పండుగ గురించి కవిత నుంచి తెలుసుకునే అవసరం ఎవరికీ పట్టలేదన్నారు.

కవితకు ప్రచార యాన ఎక్కువ
ladyకేసీఆర్‌ కూతురు కవితకు బతుకమ్మ పండుగ కన్నా దాని ద్వారా వచ్చే ప్రచారమే ముఖ్యమని తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు నర్రా విజయలక్ష్మి ధ్వజమె త్తారు. ప్రభుత్వ పరంగా బతుకమ్మ నిర్వ హించాలన్న సీఎం రోశయ్య నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రతి ఒక్క మహిళ స్వాగ తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఈ పండుగ నిర్వహణకు నిధులను మరికొంత పెంచాలని సూచిం చారు. తొలిసారిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ ప్రజాసంఘాలు, మహిళల పోరాటమే కారణమన్నారు. ‘ఈ విషయంలో తెలంగాణ జాగృతి నేత, కేసీఆర్‌ కూతురు కవితది ప్రచార ఆర్భాటమే తప్ప, చిత్తశుద్ధి లేదు.

అయినా కవిత వయ సెంత? ఆమె అనుభవం ఎంత? తెలంగాణ మహిళలు కవిత చెప్పే బతుకమ్మ కథలు వినే పరిస్థితిలో లేరు. తెలంగాణ ప్రజలు, కవు లు, కళాకారులు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ కేసీఆర్‌ కుటుంబానికి దూరమయ్యాయి. బతుకమ్మను జనంలోకి తీసుకు వెళ్లకుండా, ప్రచారం కోసం మీడియా కార్యాలయాల చుట్టూ తిరి గి, పబ్లిసిటీ కోసం పాకులాడుతోందని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు హాజరవుతామన్నారు.