ముఖ్యమంత్రి రోశయ్య

నేటి రాజకీయాలు .... మన నాయకులు....

Sunday, August 8, 2010

మచ్చలేని మనిషి రోశయ్య జిందాబాద్‌

roshaiahఅదృష్టం ఉంటేనే పదవులు వస్తాయన్నది కొంతమంది నమ్మకం. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం, మృదు స్వభావిగా ఉంటే ఎప్పటికైనా ఆ అదృష్టం, మంచి రోజులు వస్తాయని వారి విశ్వాసం. ఇక్కడ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి పదవిని ఆయన ఆశించకపోయినా విధిలేని పరిస్థితుల్లో అధిష్టానం సూచనల మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. బాధాకర పరిస్థితుల్లో విషాదం, బరువెక్కిన హృదయంతో ఆయన ఆ పదవిని చేపట్టారు. కరడుగట్టిన కాంగ్రెస్‌ వాదిగా, అసాధారణ ప్రతిభ కలిగిన రాజకీయ వేత్తగా, అనేకమంది ముఖ్యమంత్రుల తలలో నాలుకలా ఆయన పని చేశారు. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో అన్నా అనిపించుకునేంత చనువు కలిగిన వారు. ముఖ్యమంత్రి రోశయ్య ‘టర్నింగ్‌పాయింట్‌’ సూర్య పాఠకుల కోసం...

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ రాష్ట్ర ఆ ర్థిక రథచక్రాన్ని అసాధారణమైన రీతిలో నడిపిం చారు. ఒక్క నాడూ ఓవర్‌ డ్రాఫ్ట్‌ తీసుకురాని ఆర్థిక మంత్రిగా మన్ననలు పొందారు. వరుసగా రెండు ప ర్యాయాలు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. సాదాసీదాగా కనిపించే 77 సం వత్సరాల రోశయ్య అసెంబ్లీలో 15 బడ్జెట్‌లను ప్రవేశ పెట్టి అరుదైన కీర్తిని సైతం సొంతం చేసుకున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని ఆయన ఎప్పు డూ అనుకోలేదు. అయాచితంగా అత్యున్నత పీఠంపై కూర్చున్నా, అధిష్ఠానం ఆదేశాలను ఏనాడూ ధిక్కరిం చబోనని, తాను నిక్కమైన కాంగ్రెస్‌ వాదిననీ ఆ యన ఎప్పుడూ చెబుతారు.

రోశయ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రారంభ సమయం లో కొంతకాలం పాటు ధిక్కార స్వరాలు గట్టి గానే వినిపించాయి. చివరకు అన్నీ సద్దుమ ణిగాయి. ముఖ్యమంత్రి స్థానంలో రోశయ్య కుదురు కున్నారు. ఇటీవలే జరిగిన ఎంపీల సమీక్షా సమావే శంలో వైఎస్‌ తనయుడు జగన్‌ వాదనను అడ్డుకుం టూ ప్రస్తుత పరిస్థితిలో తొమ్మిది గంటల విద్యు త్‌ సాధ్యం కానే కాదని తేల్చారు. అలాగే ఓబుళాపురం గనుల అక్రమాలపై సిబిఐ విచారణకు సిఫారసు చేసి సెభాష్‌ అనిపించుకున్నారు. అది జరిగి కొద్ది కాలమై నా కాకముందే సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ సూచన మేరకు ఓబుళాపురం సహా ఆరు గనుల్లో త వ్వకాలను ఆపివేయించి ఔరా అనిపించుకున్నారు. ఆరు జిల్లాలు వరదల్లో అతలా కుతలం అయినప్పు డు అత్యంత తక్కువ వ్యవధిలో ప్రధాని మన్మో హన్‌ సింగ్‌, యుపి ఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని రప్పిం చి సహాయం చేస్తామన్న హామీ ఇప్పించుకున్నారు.

roshaiah-oathవైఎస్‌ అడుగుజాడల్లోనే...
రాష్ట్రప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్య మం త్రి వైఎస్‌ చేపట్టిన సంక్షేమపధకాలను యధా విధిగా కొనసాగించాలని ప్రయత్నిస్తూనే పాలనపై తనదైన ముద్ర పడేలా అడుగులు వేస్తు న్నారు. క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అధిష్టానం నిర్ణయాల ప్రకారం ముందుకు వెళుతున్నారు. అన్ని శాఖలపై ఆయనకు ముందు నుంచీ మంచి పట్టుం డడంతో నిత్యం సమీక్షల పేరుతో అధికారులను ప రుగులు తీయిస్తు న్నారు. పదవిని చేపట్టిన తొలి రోజుల్లో కాస్త మెత్తగా ఉన్నా క్రమంగా అధికార యంత్రాం గంలో గుబులు పుట్టిస్తున్నారు.

వైఎస్‌తో విడదీయరాని బంధం...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో రోశయ్యకు ఎంతో అ నుబంధం ఉం ది. వైఎస్‌ రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచీ తు దిశ్వాస విడిచే వరకూ ఆయనతో సన్నిహిత ంగా ఉన్నారు. రాజశేఖరరెడ్డి ఎవరితో వి బేధించినా రోశయ్యతో సని్నిహతం గా ఉండేవారు. అన్నా అని స ంబోధిస్తూ ఎంతో ఆప్యా యంగా మెలిగేవారు. సుదీర్ఘ రాజకీయ జీవి తంలో వైఎస్‌ లాంటి ప్రజల మనిషిని, ఆ త్మీయుడిని చూడ లేదని రోశయ్య వినమ్రంగా చెబు తారు.

విద్యార్ధి దశలోనే క్రియాశీల పాత్ర...
తెనాలిలో 1951 - 52లో విద్యార్ధిగా ఉన్న పుడు రోశయ్య రాజ కీయ రంగప్రవేశం చేశా రు. ఎన్‌జి రంగాకు శిష్యు నిగా, గౌతు లచ్చన్నకు ఇష్టు డుగా ఉన్న రోశయ్య అప్పట్లో విద్యార్ధి సమ్మేళన్‌లో క్రియాశీల పాత్రను పోషించారు. తెనాలి దగ్గరలోని వేమూరులో ఓ చిన్న వాణిజ్య కుటుంబం నుంచి వచ్చిన రోశయ్య కొంచెం భిన్నంగా పెరిగారు. తొలి భారత ఎన్నికలలో కాంగ్ర ెస్‌ నుంచి విడిపోయి, కృషికార్‌లోక్‌ పార్టీ పెట్టిన రంగాతో రాజకీయాల్లోకి రోశయ్య అడుగు పెట్టా రు.1954లో గుంటూరు హిందూ కళాశాలలో బీ కాం చదువుతూ అటు కమ్యూనిస్టు, ఇటు కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలతో రోశయ్య పోటీపడ్డారు. హిం దూ కాలేజీ విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా ఎన్ని కయ్యారు.

manmohan-singh-k-rosaiah1955లో ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఎన్ని కలు చరిత్ర మలుపు తిప్పాయి. కమ్యూనిస్టులు అధి కారంలోకి రావచ్చనే వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్‌ కృషికార్‌లోక్‌, ప్రజా సోషలిస్టులు ఐక్య కాం గ్రెస్‌గా ఏర్పడ్డారు. రోశయ్య రాష్టమ్రంతటా పర్యటిం చి ఉపన్యాసకుడిగా రాటుదేలారు. 1959లో స్వతం త్రపార్టీ ఆవిర్భవించినపుడు రోశయ్యకు రాజ గోపా లాచారి, బెజవాడ రామచంద్రా రెడ్డి, ఎం.రత్న స్వా మి, మర్రి చెన్నారెడ్డి, ఎం.ఆర్‌.మసానీ, పీలూ మో డీలతో పరిచయం ఏర్పడింది. తెనాలిలో రైతు నా యకుల కార్యక్రమాలు ఏర్పాటు చేసి రోశయ్య రైతు అభిమానిగా ఎదిగారు. 1962లో తొలి ఎన్నికల తె నాలిలో అపజయం చవి చూసిన రోశయ్య చాలా కా లం ప్రతిపక్షాలలో ఎదురీ దారు. 1967లో మరో సారి ఓటమిపాలైనా వెనుకం జవేయలేదు. రాజకీ యవాదిగానే జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిగతంగా అతి సామాన్య శాఖహారిగా ఉన్నారు. 1978లో కాం గ్రెస్‌లో ప్రవేశించిన రోశయ్య పార్టీలో కుదురుకు న్నారు. జలగం వెంగళరావు, టి. అంజయ్య, ఎన్‌. జ నార్ధన్‌రెడ్డి, విజయభాస్కర రెడ్డిలతో సమాన సన్ని హితంగా ఉండగలిగారు.

ప్రత్యేకాంధ్ర ఉద్యమం మరపురానఇనుభవం...
పొట్టి శ్రీరాములు మద్రాసులో నిరాహార దీక్ష చే స్తున్న సమయంలో తెనాలినుంచి కొందరు మిత్రుల తో కలిసి ఆయనను చూడడానికి వెళ్లారు. 13వ రో జున వెళ్ళినపుడు పొట్టి శ్రీరాములు కొద్దిగా కదిలా రు. మళ్లీ 33వ రోజున వెళితే అస్థిపంజరంలా ఉన్నా రు. కానీ నిరాహారదీక్ష మాత్రం మానలేదు. ఆయన ను చూడడం అనేది మరపురాని అనుభవం అని రోశ య్య అంటారు. విద్యార్థి సంఘం నాయ కుడిగా రోశ య్య అప్పట్లో ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొ న్నారు.
roshaiah-wife
పూర్తి పేరు  : కొణిజేటి రోశయ్య
పుట్టినతేది  : జులై 4, 1933
జన్మస్థలం  : వేమూరు, గుంటూరు జిల్లా
విద్యార్హతలు : బి.కాం (హిందూ కాలేజీ, గుంటూరు)
ప్రస్తుత హోదా : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 22వ ముఖ్యమంత్రి
    (వ్యక్తిపరంగా 16వ ముఖ్యమంత్రి)
భార్య  : శివలక్ష్మి
పిల్లలు  : కె.ఎస్‌.సుబ్బారావు, పి.రమాదేవి,  కె.ఎస్‌.ఎన్‌.మూర్తి

ఇదీ రాజకీయ ప్రస్థానం...
ఎమ్మెల్సీ   - 1968, 74, 80, 2009
ఎమ్మెల్యే   - 1989, 2004
ఎంపీ   - 1998 (నరసారావుపేట నియోజకవర్గం)
ప్రతిపక్షనేత  - శాసనమండలి (1978)
పీసీసీ అధ్యక్షడు - 1995 నుండి 1997

మంత్రిగా...
- తొలిసారిగా 1979లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రవాణా, రోడ్లు భవనాల 
శాఖామంత్రిగా పనిచేశారు.
- టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో రవాణా, గృహ నిర్మాణ శాఖామంత్రి (1980).
- కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోంశాఖామంత్రి (1982)
- మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్థికశాఖా మంత్రి (1989)
- నేదురమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలలో ఆరోగ్య, విద్యా, విద్యుత్‌ శాఖా మంత్రి 
- డాక్టర్‌ వై.ఎస్‌. మంత్రివర్గంలో ఆర్థి మంత్రి (2004-09)
- శాసనమండలి నుంచి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన రెండో వ్యక్తి రోశయ్య.
గతంలో భవనం వెంకట్రామిరెడ్డి ఒక్కరే కౌన్సిల్‌ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు.


- ఇస్కా రాజేష్‌బాబు

No comments:

Post a Comment