ముఖ్యమంత్రి రోశయ్య

నేటి రాజకీయాలు .... మన నాయకులు....

Sunday, August 8, 2010

వ్యవసాయ రంగంలో పరిశోధనలు జరగాలి ... ఆహారాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు దారిద్య్ర నివారణ సదస్సులో రోశయ్య


karuna and rosaiah


దేశంలో ఆహారాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు. చెన్నై, నందంబాక్కంలోని ట్రేడ్‌ సెంటర్‌లో శని వారం జరిగిన ఆకలి, దారిద్య్ర నివారణ అంతర్జాతీయ సద స్సులో రోశయ్య అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా  ఎంఎస్‌ స్వామినాధన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ 20వ వార్షికోత్సవ సావనీర్‌ను ఆవిష్కరించారు. రీసెర్చ్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజ§్‌ు ఫరిడా స్వాగతోపన్యాసం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మూడు రోజుల సదస్సును ప్రారంభించి, వార్షిక నివేదికను విడుదల చేశారు. దీనిని మాల్దీవుల వ్యవసాయ శాఖా మంత్రి ఇబ్రహీం అందుకున్నారు.

ఇందులో గౌరవ అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తులను పెంచేందుకు వీలుందన్నారు. ఎంఎస్‌ స్వామి నాధన్‌ దీర్ఘకాలంగా పరిశోధనలు జరిపి వ్యవసాయ అభివృద్ధికి ఎంతో సాయపడుతున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో వ్యవ సాయ నిపుణులు గేరి, ఉమాలేలే వంటి అనేకమంది ప్రసం గించారు. డాక్టర్‌ఎంఎస్‌ స్వామినాధన్‌ ప్రత్యేకప్రసంగం చేశారు. మంత్రులు ఆర్కాడు వీరాస్వామి, దొరైమురుగన్‌ పాల్గొన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి కృషి: తమిళనాట తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెన్నై సవేరా హోటల్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు.



karunaవ్యవసాయ రంగంలో మరింత లోతైన పరి శోధనలు జరగాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం కొణిజేటి రోశయ్య అభిప్రా యపడ్డారు. చెనై్న నందంబాక్కంలోని చెనై్న ట్రేడ్‌ సెంటర్‌లో ఎంఎస్‌. స్వామి నాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘ఆకలి- పేదరికాన్ని తొలగించడం’ అంశంపై మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు తొలిరోజు సీఎం రోశయ్య, తమిళనాడు సీఎం కరుణానిధి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడు తూ ఆంధ్రరాష్ట్రంలో వ్యవసాయ రంగం గడిచిన ఐదేళ్లలో ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. గత యాభై సంవత్సరాలతో పోల్చితే ఈ ఐదు సంవత్స రాల కాలంలో ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు.

ఇందుకు తమ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టిందన్నారు. వ్యవసాయరంగానికి బ్యాంకుల ద్వారా అధికమొత్తంలో రుణాలను అందచేశామన్నారు. అలాగే ప్రాజెక్టులను కట్టించి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తం గా పెరుగుతున్న జనాభా కూడా ఆహార ఉత్పత్తులు కొరతకు కారణమ న్నారు. దేశ భూభాగంలో 2.3శాతం మాత్రమే వ్యవసాయ యోగ్యమైన భూమికాగా జనాభా మాత్రం 17.5 శాతం పెరుగుతూ ఉందన్నారు. వ్యవ సాయ రంగంలో మరింత పరిశోధనలు జరగాలని ఆయన కోరారు. వ్యవ సాయ రంగంలో ఎంతో పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ ఈరోజు 85వ పుట్టిన రోజు జరుపుకోవడం అభినందనీయమన్నారు.

ఆయన మరింత కాలం తన పరిశోధనల ద్వారా దేశంలో వ్యవసాయరంగం మరింత అభివృద్ధ్దిలోకి తెచ్చేందుకు కృషిచేయాలని రోశయ్య కోరారు. ఈ కార్యక్రమంలో కరుణానిధి మాట్లాడుతూ రైతులకు, వ్యవసాయరంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వ్యవసాయానికి సంబం ధించి చర్యలు చేపట్టడంలోతమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కారీ ఫోల్‌వర్‌, సిబిల్లీ సూటర్‌, డాక్టర్‌ ఉమా లీలె, డా. అజయ్‌ పరిడా, డా. సౌమ్య స్వామినాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment